బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలం సత్యసాయిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో కారు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు మృతులు: చేతకం బలరామరాజు (65), చేతకం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు. ఈ ఘటనలో 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలకు గాయాలయ్యాయి. వారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.