కొత్తగా వేసిన జాతీయ రహదారి కేవలం రెండు నెలలకే పగుళ్లు ఇచ్చింది. దీంతో పనులు నిలిపివేశారు. కృష్ణపట్నం నుండి హుబ్లికి వెళ్లే 67 నంబర్ జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా ఈ తారు వేశారు. వైదుకూరు-బద్దెవోలు సెక్షన్ పరిధిలో విశ్వనాధపురం సమీపం నుండి గడ్డపవారిపల్లె వరకు ఈ రోడ్డు రెండు ముక్కలైంది. కొన్ని చోట్ల 500 మీటర్ల వరకు పగుళ్లు ఉన్నాయి. విద్యుత్ లైన్ల కింద తక్కువ ఎత్తులో రోడ్డు ఉండటం వల్ల పనులు ఆపేశామని ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్ తెలిపారు. గుత్తేదారు 15 ఏళ్లు పనులు నిర్వహిస్తామని, సమస్య ఉంటే మరమ్మత్తులు చేస్తామని స్పష్టం చేశారు.