కార్తీక

కార్తీక సోమవారం.. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ

Published on: 03-11-2025

కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు ముఖ్యంగా, విజయవాడ దుర్గా ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీక మాసంలో శివుడిని పూజించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.

Sponsored