దర్శకుడు రాజమౌళి చిత్రాల విశేషాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. ఆయన సినిమాల నుంచి వచ్చే అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా 'ఎస్.ఎస్.ఎం.బి. 29' వర్కింగ్ టైటిల్‌తో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర అప్‌డేట్‌ను ఈ నెలలో బయట పెడతామని ఆగస్టులోనే మహేశ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రకటించారు. అయితే, అప్‌డేట్‌పై ఆలస్యం కావడంతో, మహేశ్‌బాబు ఎక్స్ వేదికగా "అప్‌డేట్ ఎప్పుడిస్తారు?" అంటూ రాజమౌళిని సరదాగా ప్రశ్నించారు. దీనికి రాజమౌళి తనదైన శైలిలో జవాబిచ్చారు. ఈ విధంగా వీరిద్దరి ట్వీట్‌వార్‌తో సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు అయింది.