ఆ

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్‌ప్రీత్ కౌర్

Published on: 03-11-2025

భారత మహిళా జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఒక దశలో సెమీస్‌కు చేరుకోవడం కష్టమైనప్పటికీ, ఇప్పుడు కప్‌ను సాధించింది. దీని వెనుక ప్రతి ప్లేయర్ కష్టం ఉందనీ, మేనేజ్‌మెంట్ మద్దతు లభించిందనీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. గత నెల మాకు అనుకున్నట్లుగా సాగలేదు. అయినప్పటికీ, పోరాడి కప్పును గర్వంగా అందుకున్నాం. ఇంగ్లాండ్‌తో ఓడిపోయినా, ఆ బాధకు కుంగిపోకుండా, ముందుకు ఏం చేయాలి అనేదానిపై దృష్టి పెట్టాం. చేసిన పొరపాట్లు మళ్లీ చేయొద్దు అనే లక్ష్యంతో పయనించాం అని ఆమె తెలిపారు.

Sponsored