సూప‌ర్

సూప‌ర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

Published on: 03-11-2025

NRI

మెక్సికో సిటీలోని ఒక సూపర్‌మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు, 12 మంది గాయపడ్డారు. శనివారం వెర్సోసిలోనీ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో దురాజో ఈ ఘటనను దృవీకరించారు. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదవశాత్తు వాయువులు పేలుడు సంభవించడం వల్లే ఈ మరణాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పేలుడుకు గల స్పష్టమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

Sponsored