మియాపూర్‌లో

మియాపూర్‌లో ఐదంతస్థుల అక్రమ నిర్మాణం.. కూల్చివేత

Published on: 01-11-2025

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా (HYDRA - Hyderabad Disaster Response and Assets protection Agency) దూకుడు పెంచింది. తాజాగా మియాపూర్‌లోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల అపార్ట్‌మెంట్‌ను అధికారులు కూల్చివేశారు. హెచ్ఎండీఏ లేఅవుట్‌లో గల సర్వే నంబర్లలో, దొంగ రికార్డులు సృష్టించి ఈ నిర్మాణం జరిపినట్లు అధికారులు గుర్తించారు. హెచ్ఎండీఏ ఫెన్సింగ్‌ను తొలగించి, నిబంధనలకు విరుద్ధంగా ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టినట్లు తేలింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై హైడ్రా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

Sponsored