తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు, ఇళ్లు, పంట మునిగి సర్వం కోల్పోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.10 వేల పరిహారం అందించడం రైతుల్ని అవమానించడమేనని దుయ్యబట్టారు. భీమవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటితుడుపు చర్యల్లో ప్రభుత్వం తృప్తిచెందకూడదు. వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం చెల్లించాలి. వరద మునిగిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు అని ఆయన ఆరోపించారు.