జీఎన్టీ

జీఎన్టీ ఫలాలు.. మనకు దక్కేలా..!

Published on: 27-10-2025

దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చినా, ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గిందో సరైన అవగాహన లేక వినియోగదారులే కాక దుకాణాల యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమకు జీఎస్టీ తగ్గింపు ఫలాలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ను ఏర్పాటు చేసింది. వినియోగదారులు నేరుగా వారికి కాల్ చేసి లేదా వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపి ఫిర్యాదు చేయవచ్చు. వారు తగిన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.

Sponsored