తుఫాన్

తుఫాన్ ముప్పుతో పోర్టులు ఖాళీ

Published on: 27-10-2025

'మెండా' తుఫాన్ ముప్పు నేపథ్యంలో కాకినాడ, రాజమహేంద్రవరం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ డీప్‌ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు. ఎరువులు, బొగ్గు, నూనె వంటి నిల్వలు ఉన్న 15 నాకళ్లను సముద్రంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రం మధ్యలోని హోప్‌ ఐలాండ్‌లో ఉన్న 110 మంది మత్స్యకారులను సైతం తూరంగి కాలనీకి తరలించారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

Sponsored