హైదరాబాద్ ముంపునకు శాశ్వత పరిష్కారాలు చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం తప్పుకాదన్నారు కేంద్ర మాజీ మంత్రి బండి సంజయ్. హిందూ ఆలయాల గురించి బీజేపీ మాట్లాడటం ఎలా తప్పు అవుతుందని ఆయన ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆ శాఖ మంత్రిగా ఎలా విఫలమయ్యారో హైదరాబాద్‌లో ఒక వర్షం కురిస్తే తెలుస్తుందన్నారు. కేటీఆర్‌కు జూబ్లీహిల్స్ బంగళాలు మాత్రమే కనిపించాయని, భారస పాలనలో అభివృద్ధి చేసినట్లు నటించిన విషయం అక్కడి బస్తీ ప్రజలకు అర్థమైందని సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేటీఆర్ మాట్లాడిన వీడియోలను జతచేస్తూ 'ఎక్స్'లో పోస్టు చేశారు.