మలయాళ అగ్రతార మోహన్‌లాల్ 'తుడరుమ్' సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం రాబోతోంది. నిర్మాత రంజిత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు తరుణ్ మూర్తి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలు పూర్తయిన తర్వాత మోహన్‌లాల్‌తో ఈ కొత్త సినిమా ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. 'తుడరుమ్' కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈసారి వీరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.