భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయినప్పటికీ, ఆదివారం భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ సాగి ఉంటే అలవోకగా గెలిచేదే. వర్షం వచ్చిన ఇన్నింగ్స్‌ను 27 ఓవర్లకు కుదించగా, భారత్ మొదట బంగ్లాను దెబ్బతీసింది. స్పిన్నర్లు రాధా యాదవ్ (3/30), శ్రీశరణి (2/23) దాటికి బంగ్లా 9 వికెట్లకు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి, అమన్‌జోత్ కూడా వికెట్లు పడగొట్టారు. పర్వీన్ అక్తర్ (36) బంగ్లా టాప్ స్కోరర్. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని 126 పరుగులుగా సవరించారు. వర్షంతో ఆగిపోయే సమయానికి భారత్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. భారత్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.