బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ప్రముఖ చైనా శిల్పి యువాన్ జికున్ చెక్కిన నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత రాయబారి ప్రదీప్ రావత్ మాట్లాడుతూ, "శతాబ్దం క్రితం చైనాలో ఠాగూర్ పర్యటన.. రెండు దేశాల సంబంధాలు, పరస్పర అవగాహనలో ఓ మైలురాయి. సార్వత్రిక మానవతావాదంపై ఆయన సందేశం, జు జిమో, లియాంగ్ ఖిచావో వంటి చైనా పండితులతో ఆయనకున్న స్నేహం రెండు దేశాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు.