తెలుగుంటే

తెలుగుంటే శతాబ్దాల సాంస్కృతిక ప్రవాహం

Published on: 24-10-2025

తెలుగు భాష కేవలం మాటల వ్యవహారం కాదని, శతాబ్దాల సాంస్కృతిక ప్రవాహం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు మాట్లాడటాన్ని గొప్పగా భావించే తరాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో, తెలంగాణ సారస్వత పరిషత్తు నెలకొల్పిన బూర్గుల సోమయాజులు హనుమంతరావు స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రభుత్వ సలహాదారు డా. జాగిటి కోటేశ్వరరావుకు వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. పాశ్చాత్య వ్యామోహం, విద్యాతో ప్రలోభాలకు లోనవుతున్న యువతరాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Sponsored