కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఏపీ అధికారులతో మాట్లాడిన సీఎం, అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తక్షణమే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, గద్వాల కలెక్టర్‌ను ఘటన స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా మృతి చెందారు.