స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానికుల రిజర్వేషన్లపై తదుపరి చర్య కోసం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజు వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే నెల 7న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించారు.