ఆదిలైడ్‌లో కీలకపోరుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో కంగారూల వేటను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సీరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ భారీగా పుంజుకోవాలి. తొలి టెస్ట్‌లో నిరాశపరిచిన సీనియర్ ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. మరోవైపు గెలుపుతో ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా ఇక్కడే సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. మరి టీమ్‌ఇండియా ఎలా పోరాడుతుందో చూడాలి.సమిష్టిగా రాణించి, టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత్ కృషి చేస్తోంది. ఫైనల్ చేరాలంటే ఈ పోరులో గెలవడం అత్యవసరం.