ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, పాక్ సంబంధాలపై మోదీతో చర్చించినట్లు ట్రంప్ చెప్పగా, ఆ అంశం ప్రస్తావనకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. మంగళవారం రాత్రి శ్వేతసౌధంలో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ ఫోన్ చేశారు. 'మీ కాల్‌కు కృతజ్ఞతలు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు కలిసి నిలిచి ప్రపంచానికి వెలుగులు పంచడాన్ని కొనసాగించాలి' అని బుధవారం మోదీ పేర్కొన్నారు.