హ్యాపీ

హ్యాపీ బర్త్‌డే రాజాసాబ్.. ప్రభాస్‌కు శుభాకాంక్షల వెల్లువ

Published on: 23-10-2025

బాహుబలి ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు, దర్శకులు ఆయనకు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 'ఇండియన్ సినిమా రాజాసాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని నటులు నారా రోహిత్, మాధవన్, మంచు విష్ణు వంటి వారు పోస్ట్‌లు చేశారు. 'ఎన్నో హృదయాలు కొల్లగొట్టే రికార్డులు బ్రేక్ చేయాలి' అని దర్శకుడు మారుతి ఆకాంక్షించారు.

Sponsored