ఉప

ఉప ఎన్నికపై నేడు కేసీఆర్ దిశానిర్దేశం

Published on: 23-10-2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యూహంపై కేసీఆర్ నేడు భారత్ రాష్ట్ర సమితి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, ప్రచార శైలిపై చర్చించారు. ప్రచార ఉధృతి పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తమకు ఉప ఎన్నికల్లో విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రచారం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం కీలక నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

Sponsored