దేశంలో రక్తదానం చేయడానికి అర్హత ఉన్న 45 కోట్ల మంది ఉన్నా, 85 శాతం మంది యువత అపోహాలతో వెనుకడుగు వేస్తున్నారని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా, 40 లక్షల యూనిట్ల కొరత ఉందని తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-25లో 5.30 లక్షల యూనిట్ల అవసరానికి బదులుగా 7 లక్షల యూనిట్లకు పైగా రక్తం సేకరించి WHO ప్రమాణాలను అధిగమించిందన్నారు. రక్తదానానికి ప్రత్యామ్నాయంగా ఐరన్ సప్లిమెంట్లను ప్రోత్సహించాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే రక్తాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.