అమరావతిలో

అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి

Published on: 08-10-2025

సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి తగిన కృషి చేస్తానని చెప్పారు. గుంటూరులో అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తన తండ్రి గురించి మాట్లాడుతూ, 'ఎలా బతకాలో నేర్పిన తొలి గురువు. ఎంత ఎదిగినా సామాన్యుడిలా ఉండాలని చెప్పారు' అని అరవింద్ అన్నారు. గుంటూరులో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కొర్రపాటి సాయి, నిర్మాత బన్నీ వాసు, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తదితరులు పాల్గొన్నారు.

Sponsored