కోనసీమ

కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

Published on: 08-10-2025

కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోని గణపతి క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది కార్మికులు కేంద్రంలో ఉన్నారు. పేలుడు తీవ్రతకు గోడలు కూడా కూలిపోయాయి. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, వారం క్రితమే ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించినట్లు, అన్ని భద్రతా చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Sponsored