యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కార్తీక మాసం వేడుకలకు ముస్తాబవుతోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం దేవస్థానం సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణకు కొండ కింద ఆద్యాత్మికవాడలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక మాసం ముగిసే నవంబర్ 21 వరకు రోజూ ఆరు విడతలుగా ఈ వ్రతాలు నిర్వహిస్తారు. సోమవారం దీపావళి పండగ సందర్భంగా ఉదయం 3.30 గంటలకు సుప్రభాతం, 4.45 గంటలకు ఆస్థాన మంగళ హారతులు, 5.45 గంటలకు తిరువారాధన, బాలభోగం, అరగింపు నిర్వహిస్తారు. 7.15 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమవుతుంది.