ట్రంప్ (Donald Trump) హెచ్-1బీ వీసా ఫీజులు పెంచడంతో ఆందోళన పెరిగింది. దీనితో వీసా అభ్యర్థులను నియమించుకునే విషయంలో కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. తాజాగా అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ (Walmart) కూడా అలాంటి కీలక నిర్ణయమే తీసుకుంది. హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాలను నిలిపివేయాలని వాల్‌మార్ట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, తమ కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు వీలుగా ప్రతిభావంతులను నియమించుకునే విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ట్రంప్ నిర్ణయం.. హెచ్-1బీ వీసా అభ్యర్థుల నియామకాలు నిలిపివేసిన వాల్‌మార్ట్
Published on: 22-10-2025