జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు

Published on: 21-10-2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీ అభ్యర్థులు మరిన్ని నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అగ్రనాయకులు హాజరుకానున్నారు. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలిస్తారు, ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.

Sponsored