హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై పలు చోట్ల తారు లేచిపోవడంతో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు అంతటా గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై టోల్ వసూలు చేస్తున్నప్పటికీ, నిర్వహణపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనదారులు వాపోతున్నారు. నల్లగొండ జిల్లా ఏపీ లింగోటం వద్ద తారు పూర్తిగా తొలగిపోయి రహదారి గుంతలమయంగా మారింది.