ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ (64) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన అందెశ్రీ, చిన్నతనంలోనే కష్టాల కడలిలో ఈదుతూ కవిగా ఎదిగారు. 'మాతృదేవోభవ'తో సహా పలు సినిమా పాటలు రాశారు. 2006లో నంది అవార్డు, 2014లో లోకనాయక్ ఫౌండేషన్ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.