ఎస్వీ

ఎస్వీ కృష్ణారెడ్డి సరికొత్త ప్రయోగం.. సౌత్ కొరియా నటితో ‘వేదవ్యాస్’ స్టార్

Published on: 29-08-2025

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల దర్శకుడిగా పేరుగాంచిన ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం ‘వేదవ్యాస్’ ను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, వీవీ వినాయక్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో దక్షిణ కొరియా నటి జున్ జి హ్యున్ టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు సన్నివేశంలో దిల్ రాజు బొకే అందించగా, వినాయక్ క్లాప్ కొట్టారు, అనిల్ రావిపూడి కెమెరా యాక్షన్ చెప్పారు. మురళీ మోహన్, అలీ, సాయికుమార్ తదితరులు పాల్గొన్న ఈ వేడుకలో సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Sponsored