stock markets fall sharply

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

4

Published on: 📅 12 Mar 2026, 04:51 PM
Reporter: 🖊 Ramesh Kumar

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా పడిపోయింది. చివరకు 829 పాయింట్ల నష్టంతో 76,034 వద్ద ముగిసింది. నిఫ్టీ 227 పాయింట్లు కోల్పోయి 23,639 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు నష్టపోయాయి.

Sponsored