వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే వివిధ రంగాల్లో ఆరు రెట్లు ఉత్పాదకత సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. వాటర్ షెడ్ మహోత్సవంలో భాగంగా జాతీయ సదస్సు గుంటూరులో ప్రారంభమైంది. వాటర్‌షెడ్ 2.0 ను రూ. 13 వేల కోట్లతో అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాటర్‌షెడ్ అనేది కేవలం డ్యామ్ కాదు, గ్రామీణ భారత పునర్నిర్మాణానికి బలమైన ఒక ఫౌండేషన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో వచ్చే పదేళ్లకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని కేంద్ర భూ వనరుల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి తెలిపారు.