భాగ్యనగరంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మీరాలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేసీఎల్ ఈ టెండర్‌ను రూ.319.24 కోట్లకు దక్కించుకుంది. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. మీర్ ఆలం బహదూర్ పేరుతో 1806లో నిర్మించిన ఈ చెరువుపై నాలుగు వరుసల రోడ్డుతో వంతెన నిర్మించి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రిడ్జి పొడవు 2.5 కి.మీ., వెడల్పు 16.5 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం ట్రాఫిక్ సమస్యను కూడా తగ్గిస్తుంది.