సైబర్ నేరాల ఛేదనలో, డబ్బు రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని డీజీపీ రవి గుప్తా తెలిపారు. రాష్ట్ర ప్రజలు, సైబర్ నేరాల సహాజన్యంగా మారుతున్నారని, వీటి నియంత్రణకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. డీజీపీ నూతనంగా రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీటీఎన్ఎస్ (CCTNS) భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలు నరసింఘీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని, నేరస్తులు దొరికినా, కేసు పూర్తి అయ్యేంతవరకు సిబ్బంది పట్టువదలొద్దని డీజీపీ అధికారులను ఆదేశించారు.