టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఐపీఎల్‌కు సిద్ధమవుతూ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో ముంబయిలో ప్రాక్టీస్ చేశాడు. బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు నెట్ సెషన్లు నిర్వహించగా బ్యాటింగ్‌లో యువీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఇటీవల వైట్ బాల్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించని పంత్ ఈసారి ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి టీమ్ ఇండియాలో స్థానం తిరిగి సంపాదించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాడు. అనంతరం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ క్యాంప్‌కు చేరాడు.
ఐపీఎల్ ముందు యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో రిషభ్ పంత్ ప్రాక్టీస్
8
Published on: 📅 13 Mar 2026, 09:51 AM
Reporter: 🖊 Ramesh Kumar