telangana plans statelevel system for si promotions

ఎస్సై పోస్టులకు రాష్ట్రస్థాయి హోదా.. పదోన్నతి వివాదానికి పరిష్కారం?

5

Published on: 📅 13 Mar 2026, 09:40 AM
Reporter: 🖊 Suresh Reddy

పోలీసుల పదోన్నతుల్లో వస్తున్న వివాదాలకు ముగింపు పలకాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జోన్ల ఆధారంగా ఉన్న ఎస్సై పోస్టులను రాష్ట్రస్థాయిగా మార్చేందుకు పోలీసు సర్వీస్ రూల్స్‌లో మార్పులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు క్యాబినెట్ సబ్ కమిటీకి పంపగా ఆమోదం లభిస్తే కొత్త విధానం అమలులోకి రానుంది. జోన్ల కారణంగా ఒకే బ్యాచ్ అధికారులకు వేర్వేరు పదోన్నతులు రావడం వల్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

Sponsored