పట్నా జూకు తరలించే సన్నాహాల్లో ఢిల్లీ జూలోని ఏడాదిన్నర వయసున్న ‘దుర్గ’ అనే తెల్ల పులికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ పులి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) వైద్యులు అధునాతన ఆర్థోపెడిక్ పద్ధతులతో శస్త్రచికిత్స నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. తమ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి అని ఐసీఏఆర్ వెల్లడించింది.
తెల్ల పులికి అరుదైన శస్త్రచికిత్స
4
Published on: 📅 09 Mar 2026, 03:35 PM
Reporter: 🖊 Ramesh Kumar