rajasekhar reacts to viral gotila factory rumour

‘గోటీల ఫ్యాక్టరీ ఉందంటారా?’.. వైరల్ వీడియోపై రాజశేఖర్ క్లారిటీ

10

Published on: 📅 14 Mar 2026, 02:55 PM
Reporter: 🖊 Kiran Rao

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘గోటీల ఫ్యాక్టరీ’ వీడియోపై నటుడు రాజశేఖర్ స్పందించారు. బంగ్లాదేశ్, పాక్, భారత్‌లలో గోటీల వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలాంటి ఫ్యాక్టరీ తనకు లేదని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసి తనకు తెలిసినవారే ఫోన్ చేసి నిజమా అని అడిగారని చెప్పారు. ఈ వార్తలు విని తానే ఆశ్చర్యపోయానని రాజశేఖర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Sponsored