పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది. మార్చి 15న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. రాశీ ఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీశ్ కాంబినేషన్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
3
Published on: 📅 14 Mar 2026, 03:01 PM
Reporter: 🖊 Kiran Rao