ఈ

ఈ జిల్లాల్లో పిడుగులతో వానలు.. అధికారుల హెచ్చరిక

Published on: 15-09-2025

ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, గోదావరి జిల్లాలు, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా , ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Sponsored