తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది. దీనికి సంబంధించిన కీలక చర్చలు ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రభుత్వ ప్రతినిధులతో జరిగాయి.