netflix to open office in hyderabad

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం

Published on: 📅 07 Mar 2026, 03:21 PM
Reporter: 🖊 Ramesh Kumar

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆఫీస్‌ను ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌కు ముంబైలో కార్యాలయం ఉండగా, భారత్‌లో ఇది రెండోది కానుంది. ఈ కార్యాలయం ప్రారంభంతో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలు మరింత బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Sponsored