శ్రీవారి

శ్రీవారి సేవలో ముకేశ్ అంబానీ

Published on: 10-11-2025

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈఓ ఏ. వెంకట సదాశివరావు స్వాగతం పలికారు. అనంతరం అంబానీ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా, అదనపు ఈఓ శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. టీటీడీ బోర్డు సభ్యుడు ఎన్. సదాశివరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Sponsored