500

500 కుటుంబాలకు కర్రల వంతెనే ఆధారం

Published on: 10-11-2025

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సరిహద్దుల్లోని దేవపురం పంచాయతీలోని ఆర్తాపురం, తమ్మలపాలెం, ముగవలపాలెం గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు బయటి ప్రపంచానికి వెళ్లాలంటే వాగు దాటితేనే రహదారికి చేరుకోవాలి. వాగుపై వంతెన నిర్మించాలని ఎన్నిసార్లు కోరినా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో వారే వాగుపై చెట్ల ఆధారంగా కర్రల వంతెనను నిర్మించుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. తమకు శాశ్వత వంతెన నిర్మించాలని కోరుకుంటున్నారు.

Sponsored