ప్రైవేట్‌

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

Published on: 10-11-2025

రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఈ బస్సు, రెడ్డిగూడెం వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలింది. దాంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

Sponsored