తిరుమల పాపవినాశనం మార్గంలోని పోర్టే మంటపంలో ఆదివారం కార్తిక వనభోజన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం మలయప్పస్వామివారిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి వాహన మండపానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి స్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయ నాంచార్లు పల్లకిలో పోర్టే మంటపానికి ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. వర్షాల కారణంగా 2020 నుంచి ఇక్కడ వనభోజనాలు జరగలేదు. మూడేళ్ల తర్వాత ఈ మహోత్సవాన్ని నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.