ఎకో

ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి

Published on: 10-11-2025

ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచవచ్చని మంత్రి వనకర సత్యనారాయణ అన్నారు. ఉపాధి హామీ నిధులతో పాటు ఇతర నిధులు వినియోగించి 10-12 ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని పనుకూటివారి గూడెం, కేతపల్లి వంటి ప్రాంతాల్లో నీటి నిల్వ పెంచే చెక్‌డ్యాంలు, పశువుల దాణాని నిల్వ చేసే కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. పశువుల దాణాను తయారుచేసే మహిళా రైతులకు రూ.50 లక్షల వరకు ఇవ్వాలని సూచించారు. కొత్త టెక్నాలజీతో ఏలూరు కలెక్టరేట్‌లో మరో సమావేశం జరపాలని నిర్ణయించారు.

Sponsored