తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. తప్పు చేసి ఉంటే నోటీసు అయినా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కట్టడి చేసి, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కుట్రలు చేశారన్నారు. రూ.1,700 కోట్లకు చేరిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అన్యాయమని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కవిత డిమాండ్ చేశారు.