అనుష్క

అనుష్క శర్మపై నోరు పారేసుకున్న మృణాల్ ఠాకూర్.. మళ్లీ ట్రోలింగ్ షురూ!

Published on: 03-09-2025

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మళ్లీ ట్రోలింగ్‌కి గురవుతోంది. ఇటీవల బిపాషా బసుపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడు అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా మొదటగా తనకే ఆఫర్ వచ్చిందని, కానీ సిద్ధంగా లేక తిరస్కరించానని తెలిపింది. ఆ సినిమాలో నటించిన నటి ప్రస్తుతం సినిమాలు చేయడం లేదని, తాను మాత్రం వరుసగా బిజీగా ఉన్నానని చెప్పింది. పేరు చెప్పకపోయినా, నెటిజన్లు ఇది అనుష్క శర్మపైనే అన్నారని భావిస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు

Sponsored