ఒక పేద రైతు తన పొలంలో సాగు చేసుకునేందుకు పెట్టుబడికి అత్యవసరంగా ఒక లక్ష రూపాయల అప్పు కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా..? ఎంతో మందిని వేడుకోవాల్సిన పరిస్థితి. ‘ఏం చూసి ఇవ్వాలి..?’ అంటూ ఛీత్కారాలకు గురయ్యే దుస్థితి కూడా అన్నదాతకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా, రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వ ‘వడ్డీ రాయితీ పథకం’ (Interest Subvention Scheme). ఈ పథకం కింద ఒక రైతు సులభంగా 3 లక్షల రూపాయల వరకు రుణం తెచ్చుకోవచ్చు.